📢 ముఖ్యమైన సూచనలు:
🕒 25 MCQs | 35 నిమిషాలు.
🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).
❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).
✏️ Answer Editing కి అవకాశం లేదు.
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
ఇంటిపన్నులు ఎవరు వసూలు చేస్తారు?
మండల రెవెన్యూ అధికారి.
గ్రామ రెవెన్యూ అధికారి.
గ్రామపంచాయితీ కార్యదర్శి.
పైవన్నీ సరైనవే.
గ్రామ ప్రజల నుండి ఇంటిపన్నులు, కుళాయి బిల్లులు వసూలు చేసే బాధ్యత గ్రామపంచాయితీ కార్యదర్శికి ఉంటుంది. ఈ పన్నులు గ్రామాభివృద్ధి కార్యక్రమాలు, శుభ్రత, పారిశుధ్యం మరియు ప్రజా సౌకర్యాల కోసం ఉపయోగించబడతాయి.
మండల పరిషత్ సమావేశాలు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతాయి?
తహశీల్దార్.
మండల పరిషత్ అధ్యక్షుడు.
జిల్లా పరిషత్ అధ్యక్షుడు.
మండల పరిషత్ అభివృద్ధి అధికారి.
మండల పరిషత్ సమావేశాలు మండల పరిషత్ అధ్యక్షుడి (ఛైర్మన్) ఆధ్వర్యంలో జరుగుతాయి. తహసీల్దార్ , వ్యవసాయశాఖ అధికారి, పశు వైద్య అధికారి, మండల విద్యాధికారి, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యులు మొదలగువారు ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశాలలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) ముఖ్య పాత్ర పోషిస్తారు.
గ్రామంలో పంటల వివరాలను నమోదు చేసే బాధ్యత ఎవరిది?
మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్.
గ్రామ రెవెన్యూ అధికారి.
గ్రామపంచాయితీ కార్యదర్శి.
మండల అభివృద్ధి అధికారి.
గ్రామంలో పంటల వివరాలు, భూముల వినియోగం, రైతుల వద్ద ఉన్న సాగు సమాచారం మొదలైనవి నమోదు చేసే బాధ్యత గ్రామ రెవెన్యూ అధికారి (VRO) దే. ఆయన భూసంబంధిత రికార్డులు నిర్వహించి, రైతులకు అవసరమైన పత్రాలను అందజేస్తారు.
మండల పరిషత్ అభివృద్ధి సమావేశాలు ఎన్ని నెలలకు ఒకసారి జరుగుతాయి?
3 నెలలకు ఒకసారి.
2 నెలలకు ఒకసారి.
నెలకు ఒకసారి.
4 నెలలకు ఒకసారి.
మండల పరిషత్ అభివృద్ధి సమావేశాలు సాధారణంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించబడతాయి. ఈ సమావేశాల్లో మండల స్థాయి అభివృద్ధి పనులపై చర్చ జరుగుతుంది, నిధుల వినియోగం, పథకాల అమలు, ప్రజల సమస్యల పరిష్కారం, భవిష్యత్ ప్రణాళికలపై చర్చ జరుగుతుంది.
క్రిందివాటిలో పశు వైద్యశాల యొక్క బాధ్యతలు ఏవి?
జంతువుల ఆరోగ్యాన్ని సంరక్షించుట.
జంతువులకు వచ్చే రోగాలను గుర్తించుట, చికిత్స చేయుట.
యజమానులకు జంతువుల పెంపకం గురించి సూచనలు, సలహాలు ఇవ్వడం.
పైవన్నీ సరైనవే.
పశు వైద్యశాల జంతువుల ఆరోగ్యం, రోగ నిర్ధారణ, చికిత్స, అలాగే యజమానులకు జంతు సంరక్షణ, పెంపకం, పోషణలపై సలహాలు ఇవ్వడం, జంతువులద్వారా మానవులకు సంక్రమించే వ్యాధులను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం వంటి విస్తృతమైన బాధ్యతలను నిర్వర్తిస్తుంది.
క్రిందివాటిలో గ్రామంలో సౌకర్యాలను కల్పించడం దేని బాధ్యత?
గ్రామపంచాయితీ.
మున్సిపాలిటీ.
మున్సిపల్ కార్పొరేషన్.
తాహసీల్దార్ కార్యాలయం.
గ్రామంలో తాగునీరు, రహదారులు, విద్యుత్ దీపాలు, చెత్త శుభ్రపరచడం, పారిశుధ్యం వంటి ప్రాథమిక సౌకర్యాలను కల్పించే బాధ్యత గ్రామపంచాయితీదే. ఇది గ్రామ ప్రజల అవసరాలను తీర్చే ప్రధాన స్థానిక ప్రభుత్వ సంస్థ.
RTI Act ప్రకారం, పౌరులు తెలుగులో సమాచారాన్ని పొందే హక్కు ఏ సెక్షన్ ద్వారా లభిస్తుంది?
సెక్షన్ 4(1)(b).
సెక్షన్ 6(1).
సెక్షన్ 4(4).
సెక్షన్ 2(j).
సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం, Section 4(4) లో ప్రభుత్వం ప్రజలకు అందించే సమాచారం స్థానిక భాషలో సులభంగా అర్థమయ్యే విధంగా ఉండాలని స్పష్టంగా పేర్కొంది. అందువల్ల పౌరులు తెలుగులో సమాచారాన్ని పొందే హక్కు ఈ సెక్షన్ ద్వారా లభిస్తుంది.
క్రిందివాటిలో మండల పరిషత్ కార్యాలయం యొక్క విధులలో సరికానిది ఏది?
ప్రాథమిక విద్యను అందించడం.
సాగునీటి సరఫరా చేయడం.
కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేయడం.
మండలంలో రోడ్ల నిర్మాణం చేయడం.
మండల పరిషత్ కార్యాలయం ప్రాథమిక విద్య, సాగునీటి సరఫరా, రోడ్ల నిర్మాణం వంటి ప్రాంతీయ అభివృద్ధి పనులను చేపడుతుంది. అలాగే వ్యవసాయం, పశుపోషణ, చేపలు, కోళ్ళ పెంపకం అభివృద్ధి చేయడం మరియు ఆరోగ్యం, శిశు సంక్షేమం మొదలైన కార్యక్రమాలు చేపడుతుంది.
పాఠశాలల్లో మధ్యాహ్నభోజన కార్యక్రమాన్ని పర్యవేక్షించేది ఎవరు?
తహశీల్దారు కార్యాలయం.
జిల్లా కలెక్టర్ కార్యాలయం.
మండల వనరుల కేంద్రం.
ఏదీకాదు.
పాఠశాలల్లో మధ్యాహ్నభోజన (Mid-Day Meal) కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేయడం, ఆహారం సరఫరా, నాణ్యత పర్యవేక్షణ చేయడం మండల వనరుల కేంద్రం యొక్క ప్రధాన బాధ్యత. అలాగే విద్యార్ధులకు ఉచిత పాఠ్యపుస్తకాలను మరియు యూనిఫాంలు పంపిణీ చేస్తుంది.
క్రిందివాటిలో కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలను ఎవరు జారీ చేస్తారు?
మండల అభివృద్ధి కార్యాలయం.
తహసీల్దార్ కార్యాలయం.
జిల్లా కలెక్టర్ కార్యాలయం.
ఏదీ కాదు.
కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలు తహసీల్దార్ కార్యాలయం ద్వారా జారీ చేయబడతాయి. ఈ పత్రాలు విద్య, ఉద్యోగం, సంక్షేమ పథకాల కోసం అవసరమవుతాయి.
రెవెన్యూ కార్యాలయ పనులకు ఎవరు బాధ్యత వహిస్తారు?
మండల రెవెన్యూ అధికారి.
గ్రామ రెవెన్యూ అధికారి.
మండల అభివృద్ధి అధికారి.
గ్రామపంచాయితీ కార్యదర్శి.
గ్రామ స్థాయిలో రెవెన్యూ కార్యాలయానికి సంబంధించిన పనులు—భూమి వివరాలు, పంటల నమోదు, అడంగల్ తయారీ—గ్రామ రెవెన్యూ అధికారి (VRO) ద్వారా నిర్వహించబడతాయి. ఆయన రెవెన్యూ శాఖకు చెందిన స్థానిక అధికారిగా పనిచేస్తారు. గ్రామ ప్రజలకు భూసంబంధిత సేవలను అందించే ప్రధాన అధికారి ఆయనే.
జనన మరణాల నమోదును నిర్వహించే అధికారి ఎవరు?
మండల రెవెన్యూ అధికారి.
గ్రామ రెవెన్యూ అధికారి.
మండల అభివృద్ధి అధికారి.
గ్రామపంచాయితీ కార్యదర్శి.
గ్రామంలో పుట్టిన పిల్లల జననాలు, మరణాలు అధికారిక రికార్డులలో నమోదు చేసే బాధ్యత గ్రామపంచాయితీ కార్యదర్శికి ఉంటుంది. ఈ నమోదులు ప్రభుత్వానికి గణాంకాలు అందించడంలో మరియు ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు జారీ చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
క్రిందివాటిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క విధులు ఏవి?
ఆరోగ్య ఉపకేంద్రాల నిర్వహణను పర్యవేక్షించడం.
జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను మండలంలో అమలు చేయడం.
రోగాల తీవ్రతను బట్టి రోగులను జిల్లా ఆస్పత్రికి సిఫారసు చేయడం.
పైవన్నీ సరైనవే.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మండలంలో ఆరోగ్య ఉపకేంద్రాలను పర్యవేక్షించటం, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేయటం, రోగాల తీవ్రతను బట్టి అవసరమైతే రోగులను జిల్లా ఆస్పత్రికి సిఫారసు చేయటం, మాతా-శిశు సంరక్షణ కింద కాన్పులు చేయడం వంటి విధులు నిర్వహిస్తాయి.
క్రిందివాటిలో “గ్రామ రెవెన్యూ అధికారి” యొక్క ప్రధాన బాధ్యత ఏమిటి?
గ్రామ అభివృద్ధి పనులు.
పాఠశాల నిర్వహణ.
ఆరోగ్య సేవల నిర్వహణ.
భూమి వివరాల నమోదు.
గ్రామ రెవెన్యూ అధికారి యొక్క ప్రధాన బాధ్యత గ్రామంలో భూముల రికార్డులు, సర్వే నంబర్లు, పంటల వివరాలు వంటి భూసంబంధిత సమాచారాన్ని నమోదు చేసి నిర్వహించడం. ఈ రికార్డులు రైతులకు అవసరమైన సర్టిఫికెట్లు జారీ చేయడంలో, ప్రభుత్వ గణాంకాలు సిద్ధం చేయడంలో ఉపయోగపడతాయి.
సమాచారహక్కు చట్టం ఎప్పటినుండి అమలులోకి వచ్చింది?
15 జూన్ 2005.
12 సెప్టెంబర్ 2005.
12 అక్టోబర్ 2005.
12 నవంబర్ 2005.
భారతదేశంలో సమాచారహక్కు (Right to Information - RTI) చట్టం 2005లో జారీ చేయబడింది, మరియు 12 అక్టోబర్ 2005 నుండి అధికారికంగా అమలులోకి వచ్చింది. ఇది ప్రభుత్వ కార్యకలాపాలపై ప్రజలకు సమాచారం పొందే హక్కును కల్పిస్తుంది.
క్రిందివాటిలో తహసీల్దార్ కార్యాలయం యొక్క విధులు ఏవి?
రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను మంజూరు చేయడం.
భూ వివాదాలను పరిష్కరించడం.
ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేటట్లు చూడడం.
పైవన్నీ సరైనవే.
తహసీల్దార్ కార్యాలయం యొక్క విధులు:- గ్రామ రెవెన్యూ అధికారులు మరియు మండలంలోని కార్యాలయ సిబ్బంది పనిని పర్యవేక్షించడం, రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయడం, భూ వివాదాలను పరిష్కరించడం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించటం, వెట్టిచాకిరి నుండి ప్రజలను విముక్తి చేయడం మొదలైనవి.
క్రిందివాటిలో మండల వనరుల కేంద్రం యొక్క బాధ్యతలు ఏవి?
మండలంలో 100% బడి ఈడు పిల్లలను బడిలో నమోదు చేయడం.
పాఠశాలలను పర్యవేక్షించడం, నాణ్యమైన విద్యను అందించేలా చూడడం.
సక్రమంగా హాజరు కాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం.
పైవన్నీ సరైనవే.
మండల వనరుల కేంద్రం అన్ని ప్రభుత్వ పాఠశాలల నాణ్యతను పర్యవేక్షించి, 100% బడి ఈడు పిల్లలను బడిలో నమోదు చేయడం, సక్రమంగా హాజరు కాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం, నాణ్యమైన విద్యను అందించడం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తుంది.
క్రిందివాటిలో పోలీస్ స్టేషన్ యొక్క విధులు ఏవి?
శాంతి భద్రతలు కాపాడడం.
నేరాలు జరగకుండా చూడడం.
ఫిర్యాదులపై విచారించి వాటిని రికార్డు చేయడం.
పైవన్నీ సరైనవే.
పోలీస్ స్టేషన్ యొక్క విధులు:- శాంతి భద్రతలు కాపాడడం, నేరాలు జరగకుండా చూడడం, ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, ప్రజలనుండి ఫిర్యాదులను స్వీకరించి తక్షణం స్పందించడం, ఫిర్యాదులపై విచారించి వాటిని రికార్డు చెయడం, బాలల రక్షణ సంస్థల పరిరక్షణ మొదలైనవి.
బ్యాంకుల యొక్క విధులకు సంబంధించి క్రిందివాటిలో సరైనవి ఏవి?
ప్రజలనుండి డిపాజిట్లను స్వీకరించడం.
మండల పరిధిలోని ప్రజలకు రుణాలను ఇవ్వడం.
మండలంలోని మహిళా సంఘాలకు రుణాలను ఇవ్వడం.
పైవన్నీ సరైనవే.
బ్యాంకులు ప్రజల డిపాజిట్లను స్వీకరించడం, స్థానిక ప్రజలకు రుణాలు ఇవ్వడం, మహిళా స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి రుణాలు ఇవ్వడం, ATM కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటి విస్తృతమైన ఆర్థిక సేవలను అందిస్తాయి.
జీవించే హక్కుకు సంబంధించిన విషయంలో RTI Act ప్రకారం కోరిన సమాచారాన్ని పొందడానికి గడువు కాలం ఎంత?
30 రోజుల లోపు.
30 గంటల లోపు.
48 రోజుల లోపు.
48 గంటల లోపు.
RTI చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్న 30 రోజులలోపు సంబంధిత అధికారి సమాచారం ఇవ్వాలి. అయితే జీవించే హక్కు వంటి అత్యవసర అంశాలకు సంబంధించి కోరిన సమాచారాన్ని దరఖాస్తు చేసుకున్న48 గంటల లోపు అందించాలి. ఇది పౌరుల ప్రాణభద్రత, ఆరోగ్యం వంటి అత్యవసర అంశాలకు వర్తిస్తుంది.
“ఫహాణీ” కి గల మరొక పేరు ఏమిటి?
పట్టా పాస్ బుక్.
పన్ను రశీదు.
అడంగల్.
ఏదీ కాదు.
రైతుల భూముల వివరాలు, పంటలు, సర్వే నంబర్లు వంటి సమాచారం ఫహాణీ లో నమోదు చేయబడుతుంది. దీనినే అడంగల్ అని కూడా అంటారు. ఇది భూసంబంధిత ముఖ్యమైన పత్రం. ఇది తహసీల్దార్ కార్యాలయం ద్వారా భూమి వివరాల కోసం ఉపయోగించబడుతుంది.
చౌకధరల దుకాణాల ద్వారా సరుకులు సక్రమంగా అందకపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి?
జిల్లా కలెక్టర్.
తహసీల్దార్.
గ్రామ కార్యదర్శి.
మండల అభివృద్ధి అధికారి.
ప్రజలకు చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకులు సక్రమంగా అందకపోతే, తహసీల్దార్ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చు. తహసీల్దారు ఆహార పంపిణీ వ్యవస్థను పర్యవేక్షించే అధికారిగా పనిచేస్తారు.
ఆహార భద్రత కార్డు ఎవరిద్వారా అందజేయబడుతుంది?
తహసీల్దార్ (MRO).
మండల అభివృద్ధి అధికారి (MPDO).
గ్రామ రెవెన్యూ అధికారి (VRO).
జిల్లా కలెక్టర్.
ఆహార భద్రత కార్డు (Food Security Card) ప్రజలకు అందజేయడం తహసీల్దార్ కార్యాలయం ద్వారా జరుగుతుంది. ఇది పేద కుటుంబాలకు రేషన్ సరఫరా కోసం ఉపయోగించే ముఖ్యమైన పత్రం.
ఐరిస్ టెక్నాలజీతో కనుగుడ్డు పైభాగాన్ని పోటోతీసే విధానాన్ని ఎవరు కనుగొన్నారు?
మిమిజోయ్.
డాక్టర్ శ్యాం వర్మ.
సుచిత్రా బోస్.
పీటర్ బర్గ్.
మనిషి కనుగుడ్డుపై ఉన్న వలయాకార భాగాన్ని ఐరిస్ అంటారు. ఆధార్ కార్డు జారీ చేసే సందర్భంలో ఐరిస్ కెమెరా ఐరిస్ భాగాన్ని ఫోటో తీసి చెదిరిపోకుండా పదిలంగా భద్రపరుస్తుంది. దీనిని మిమిజోయ్ కనుగొన్నారు.
ఆరోగ్యశ్రీ కార్డు కోసం ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి?
జిల్లా కలెక్టర్.
తహశీల్దార్.
మండల పరిషత్ అధ్యక్షుడు.
మండల అభివృద్ధి అధికారి.
ఆరోగ్యశ్రీ కార్డు కోసం జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆధ్వర్యంలో జరుగుతుంది. కలెక్టర్ గారు ఆ దరఖాస్తును పరిశీలించి ఆరోగ్య భీమా విభాగ అధికారికి పంపిస్తారు.
