📢 ముఖ్యమైన సూచనలు:
🕒 25 MCQs | 35 నిమిషాలు.
🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).
❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).
✏️ Answer Editing కి అవకాశం లేదు.
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
ఉస్మాన్ సాగర్ ఆనకట్ట నిర్మాణం ఏ సంవత్సరంలో జరిగింది?
1890
1900
1910
1920
7వ నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1920వ సంవత్సరంలో మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ ఆనకట్టను నిర్మించి హైదరాబాద్ నగర ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించారు.
క్రిందివాటిలో కాకతీయుల కాలంలో నిర్మించబడిన నిర్మాణాలు ఏవి?
వరంగల్లు కోట, వేయి స్తంభాల గుడి.
రామప్ప దేవాలయం.
రామప్ప చెరువు, పాకాల చెరువు.
పైవన్నీ సరైనవే.
కాకతీయుల కాలంలో నిర్మాణ కళ అత్యున్నత స్థాయికి చేరింది. వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, రామప్ప చెరువు, పాకాల చెరువు వంటి నిర్మాణాలు ఆ కాలపు శిల్పకళా మరియు నీటి యాజమాన్య నైపుణ్యానికి నిదర్శనాలు.
శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం లోని కవులను ఏమని పిలిచేవారు?
నవదిగ్గజాలు.
అష్టదిగ్గజాలు.
నవరత్నాలు.
అష్టరత్నాలు.
శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఎనిమిది మంది మహా కవులు ఉండేవారు. వారిని అష్టదిగ్గజాలు అని పిలిచేవారు. వారి పేర్లు: 1) అల్లసాని పెద్దన, 2) ధూర్జటి, 3) నంది తిమ్మన, 4) మాదయ్యగారి మల్లన, 5) తెనాలి రామకృష్ణ, 6) పింగళి సూరన, 7) అయ్యలరాజు రామభద్రుడు, 8) రామరాజ భూషణుడు.
వ్యవసాయం, పరిశ్రమలను అభివృద్ధి చేసిన నిజాం రాజు ఎవరు?
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.
మీర్ ఖమరుద్దీన్ ఖాన్.
నాసిర్ ఉద్దౌలా.
అఫ్జల్ ఉద్దౌలా.
హైదరాబాద్ రాష్ట్ర చివరి మరియు 7వ నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బ్రిటీషు వారి ప్రభావంతో వ్యవసాయాన్ని మరియు పరిశ్రమలను అభివృద్ధి చేశాడు. విద్యాసంస్థలను కూడా స్థాపించాడు.
క్రిందివాటిలో అల్లసాని పెద్దన రచించిన గ్రంధం ఏది?
వసు చరిత్ర.
మను చరిత్ర.
కళా పరిణయం.
కళా పూర్ణోదయం.
అల్లసాని పెద్దన ప్రధానంగా మనుచరిత్ర అనే గ్రంధాన్ని రచించారు. ఈ గ్రంధం ఆరు ఆశ్వాసాలు కలిగి, స్వారోచిష మనువు కథను వివరిస్తుంది మరియు ఇది తెలుగులో మొదటి ప్రబంధంగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రంధాన్ని ఆయన శ్రీకృష్ణదేవరాయలకు అంకితం చేశారు. అల్లసాని పెద్దనకు "ఆంధ్ర కవితా పితామహుడు" అనే బిరుదు కలదు.
క్రిందివాటిలో పింగళి సూరన రచించిన గ్రంధాలు ఏవి?
కళాపరిణయం, కళాపూర్ణోదయం.
రాఘవపాండవీయం, వసు చరిత్ర.
రామాయణ కథ, రాఘవపాండవీయం.
రాఘవపాండవీయం, కళాపూర్ణోదయం.
పింగళి సూరన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకరు. ఆయన రచించిన గ్రంధాలు: గిరిజా కళ్యాణం, గరుడ పురాణం, రాఘవపాండవీయం, కళాపూర్ణోదయం, ప్రభావతీప్రద్యుమ్నం. వీటిలో గరుడ పురాణాన్ని తన తండ్రికి, కళాపూర్ణోదయాన్ని నంద్యాల కృష్ణమరాజుకు అంకితమిచ్చారు.
"పాండురంగ మహాత్మ్యం" గ్రంధాన్ని రచించింది ఎవరు?
హర్షవర్ధనుడు.
పింగళి సూరన.
తెనాలి రామకృష్ణుడు.
అల్లసాని పెద్దన.
పాండురంగ మహాత్మ్యం అనే గ్రంధాన్ని రచించింది తెనాలి రామకృష్ణుడు. ఇతడిని వికటకవి అని కూడా అంటారు. ఈ గ్రంధం ఐదు గొప్ప తెలుగు కావ్యాలలో (పంచమహాకావ్యాలు) ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇందులో విష్ణువు అవతారమైన పాండురంగ పురాణం గురించి వివరించబడింది.
క్రిందివారిలో కాకతీయులలో ప్రసిద్ధి చెందినవారు ఎవరు?
గణపతిదేవుడు, రుద్రమదేవి.
గణపతిదేవుడు, మొదటి బేతరాజు.
రుద్రమదేవి, రెండవ ప్రోలరాజు.
రుద్రమదేవి, మొదటి ప్రోలరాజు.
కాకతీయులలో గణపతిదేవుడు మరియు అయన కుమార్తె రుద్రమదేవి అత్యంత ప్రసిద్ధి చెందినవారు. వారు తెలుగు భాష మాట్లాడేవారందర్నీ ఏకం చేశారు. గణపతిదేవుడు కాకతీయ సామ్రాజ్యంలో అత్యంత శక్తివంతమైన పాలకుడు మరియు రుద్రమదేవి తెలుగు ప్రాంతాన్ని పాలించిన ఏకైక మహిళా పాలకురాలు.
మొఘలులను ఎదిరించి మరాఠా రాజ్యాన్ని స్థాపించినవారు ఎవరు?
శివాజీ.
బాజీరావు.
అబుల్ ఫజల్.
శంభాజీ.
మొఘలులను ఎదిరించి మరాఠా రాజ్యాన్ని స్థాపించిన వీరుడు శివాజీ. ఇతడు హిందూ మతస్థుడైనప్పటికీ పరమత సహనం కలిగిఉండి గొప్ప పేరు సంపాదించుకున్నాడు. అతడు హైందవీ స్వరాజ్యాన్ని స్థాపించి, రాయ్‌గఢ్‌ను తన రాజధానిగా చేసుకుని, 1674లో ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకున్నాడు.
క్రిందివాటిలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేపట్టని నిర్మాణం ఏది?
ఉస్మాన్ సాగర్.
నిజాం సాగర్.
హుస్సేన్ సాగర్.
అలీ సాగర్.
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజాం సాగర్, అలీ సాగర్ మరియు ఉస్మాన్ సాగర్ వంటి నిర్మాణాలు చేపట్టారు. అయితే హుస్సేన్ సాగర్ మాత్రం అంతకంటే ముందు కాలంలోనే 1562లో కుతుబ్ షాహీ రాజు అయిన ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనలో హజ్రత్ హుస్సేన్ షా వలీ ద్వారా నిర్మించబడింది.
“దేశ భాషలందు తెలుగు లెస్స” అని పేర్కొన్నది ఎవరు?
శ్రీకృష్ణదేవరాయలు.
పింగళి సూరన.
రామరాజ భూషణుడు.
నంది తిమ్మన.
“దేశ భాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఇది తెలుగు భాష గొప్పతనాన్ని మరియు ఆయనకు తెలుగు మీద ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది.
ఎల్లోరా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
ఆంధ్రప్రదేశ్.
తెలంగాణ.
మహారాష్ట్ర.
కర్నాటక.
ఎల్లోరా గుహలు భారతదేశంలోని మహారాష్ట్రలో ఔరంగాబాద్ నగరానికి సమీపంలో ఉన్నాయి. ఈ గుహలు హిందూ, బౌద్ధ, మరియు జైన మతాలకు సంబంధించిన రాతితో చెక్కబడిన దేవాలయాలు, మఠాల సముదాయం. ఎల్లోరా గుహలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడ్డాయి.
"పారిజాతాపహరణం" అనే కావ్యాన్ని ఎవరు రచించారు?
మాదయ్యగారి మల్లన .
అయ్యలరాజు రామభద్రుడు.
నంది తిమ్మన.
ధూర్జటి.
పారిజాతాపహరణం అనే కావ్యాన్ని నంది తిమ్మన రచించారు. ఇతడిని ముద్దుగా 'ముక్కు తిమ్మన' అని కూడా పిలుస్తారు. పారిజాతాపహరణం ఐదు ఆశ్వాసాల కావ్యం. ఇది సంస్కృత హరివంశంలోని ఒక చిన్న కథ ఆధారంగా నంది తిమ్మన రాసిన సుందరమైన ప్రబంధ కావ్యం.
గుప్తుల కాలంలోని నవరత్నాలలో అత్యంత ప్రసిద్ధ కవి ఎవరు?
కాళిదాసు.
అమరసింహుడు.
వరరుచి.
శంకభట్టు.
గుప్తుల కాలంలోని నవరత్నాలలో అత్యంత ప్రసిద్ధి చెందిన కవి కాళిదాసు. ఆయన సంస్కృత సాహిత్యంలో గొప్ప కవి మరియు నాటక రచయితగా పేరు పొందారు. కాళిదాసు రచనలలోముఖ్యమైనవి: కుమారసంభవం, రఘువంశం, అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాళవికాగ్నిమిత్రం, మేఘదూతం, ఋతుసంహారం మొదలైనవి.
నిజాం రాజులు ఏ భాషలో మాట్లాడేవారు?
తెలుగు.
హిందీ.
డెక్కనీ ఉర్దూ.
మరాఠీ.
హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించిన నిజాం రాజులు మహ్మదీయులు మరియు వారు డెక్కనీ ఉర్దూ భాష మాట్లాడేవారు. అయితే రాష్ట్రంలోని అధిక శాతం ప్రజలు మాత్రం హిందువులు. వారు తెలుగు, కన్నడ, మరాఠీ వంటి భాషలు మాట్లాడేవాళ్ళు.
శివాజీ గురువు ఎవరు?
బైరామ్ ఖాన్.
సమర్థ రామదాసు.
గురు గోవింద్ సింగ్.
గురు తేజ్ బహదూర్.
శివాజీ యొక్క మతపరమైన గురువు సమర్థ రామదాసు. ఇతడు శివాజీకి ఆధ్యాత్మిక గురువుగా, మార్గదర్శకుడిగా ఉన్నారు. అయితే శివాజీకి యుద్ధ విద్యలు, పరిపాలన వంటి విషయాలలో శిక్షణ ఇచ్చిన గురువు మాత్రం దాదాజీ కొండ దేవ్.
క్రిందివాటిలో ధూర్జటి కవి రచించిన కావ్యం ఏది?
పాండురంగ మహాత్మ్యం.
శ్రీకాళహస్తీశ్వర మహత్యం.
రామాయణ కావ్యం.
సకలకథాసారం.
ధూర్జటి కవి రచించిన ముఖ్యమైన కావ్యం శ్రీకాళహస్తీశ్వర మహత్యం. ఇది ఒక ప్రబంధ కావ్యం. దీనిలో శ్రీకాళహస్తి క్షేత్ర మహిమ, అక్కడి భక్తులైన సాలెపురుగు, పాము, ఏనుగు, తిన్నడు వంటి వారి శివభక్తి కథలు ఉంటాయి. అలాగే ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం కూడా రచించాడు.
“ఆముక్త మాల్యద” అనే గ్రంధాన్ని ఎవరు రచించారు?
తెనాలి రామకృష్ణ.
అల్లసాని పెద్దన.
ధూర్జటి.
శ్రీకృష్ణదేవరాయలు.
ఆముక్త మాల్యద గ్రంథాన్ని విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు రచించారు. ఆయన స్వయంగా ఒక కవి. ఈ గ్రంధానికి "విష్ణుచిత్తీయం" అని మరో పేరు కూడా ఉంది. ఇందులో ఆండాళ్ జీవితాన్ని కవిత్వ రూపంలో వర్ణించారు.
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలనా కాలం ఏది?
1869 – 1925.
1911 – 1948.
1902 – 1948.
1927 – 1948.
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1911 నుండి 1948 వరకు హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించారు. 1948లో భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకుంది.
ఎల్లోరా గుహలు ఏ రాజవంశ కాలానికి చెందినవి?
చాళుక్యులు.
గుప్తులు.
పల్లవులు.
మౌర్యులు.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎల్లోరా గుహలు గుప్తుల కాలానికి చెందినవి. గుప్త యుగంలో శిల్పకళ, దేవాలయ నిర్మాణ కళలు విశేషంగా అభివృద్ధి చెందాయి.
క్రిందివారిలో పరమతసహనం కలిగిన మొఘల్ చక్రవర్తి ఎవరు?
ఔరంగజేబు.
హుమాయూన్.
జహంగీర్.
అక్బర్.
భారతదేశాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తుల్లో అక్బర్ అత్యంత ప్రసిద్ధి చెందినవాడు. అతడు మహమ్మదీయ మతస్థుడైనప్పటికీ పరమత సహనం కలిగినవాడు మరియు గొప్ప పరిపాలకుడు.
విజయనగర రాజులలో ప్రముఖుడు ఎవరు?
శ్రీకృష్ణదేవరాయలు.
మొదటి బుక్కరాయలు.
అచ్యుతరాయలు.
వెంకటపతిరాయలు.
విజయనగర రాజులలో అత్యంత ప్రసిద్ధి చెందిన, ప్రతిభావంతుడైన, పరాక్రమశాలిగా పేరుపొందిన రాజు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన పాలనలో సాహిత్యం, శిల్పకళ, వ్యవసాయం,వాణిజ్యం, నీటి నిర్వహణ వంటి రంగాల్లో గొప్ప అభివృద్ధి జరిగింది.
శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలం ఏది?
1491 – 1503.
1503 – 1509.
1509 – 1529.
1529 = 1542.
శ్రీకృష్ణదేవరాయలు 1509 నుండి 1529 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఆయన పాలనలో సామ్రాజ్యం అత్యున్నత శిఖరాలను అధిరోహించింది. ఆర్థిక, సైనిక, సాంస్కృతిక రంగాల్లో గొప్ప అభివృద్ధి సాధించబడింది. ఆయన కాలం విజయనగర చరిత్రలో స్వర్ణయుగంగా ప్రసిద్ధి చెందింది.
క్రిందివారిలో అష్టదిగ్గజాలలో లేనివారు ఎవరు?
బాణభట్టు.
నంది తిమ్మన.
పింగళి సూరన.
మాదయగారి మల్లన.
బాణభట్టు ఒక సంస్కృత కవి మరియు ఇతడు హర్షవర్ధనుని ఆస్థాన కవి. బాణభట్టు ప్రధానంగా సంస్కృతంలో 'హర్షచరిత్ర' (హర్షుని జీవిత చరిత్ర), మరియు 'కాదంబరి' అనే ప్రసిద్ధ నవల రచించారు.
హైదరాబాద్ రాష్ట్ర చివరి నిజాం ఎవరు?
నిజాం అలీ ఖాన్.
మహబూబ్ అలీ ఖాన్.
మీర్ అక్బర్ అలీ ఖాన్.
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.
హైదరాబాద్ రాష్ట్రపు చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అతడిని అసఫ్ జా VII మరియు 7వ నిజాం అని కూడా అంటారు.
