📢 ముఖ్యమైన సూచనలు:
🕒 20 MCQs | 30 నిమిషాలు.
🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).
❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).
✏️ Answer Editing కి అవకాశం లేదు.
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
నేడు సగటున ఎంత సమయానికి ఒక జీవజాతి కనుమరుగు అవుతోంది?
ప్రతి 20 నిమిషాలకు.
ప్రతి 20 గంటలకు.
ప్రతి 20 రోజులకు.
ప్రతి 20 నెలలకు.
భూమిపై మనిషి లేని కాలంలో సగటున ఏడాదికొక జీవజాతి మాత్రమే నశించేది. కానీ నేడు మాత్రం శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం సగటున ప్రతి 20 నిమిషాలకు ఒక జీవజాతి కనుమరుగు అవుతోంది. మనిషి యొక్క అత్యాశ ఈ జీవవైవిధ్యం దెబ్బతినడానికి ప్రధాన కారణం.
నెమలి ఈకలతో విసనకర్రలను తయారుచేసి సంతలలో అమ్మేదెవరు?
రైతులు.
వ్యాపారులు.
పశువుల కాపరులు.
గిరిజనులు.
నెమలి ఈకల విసనకర్ర వంటి అలంకరణ వస్తువులను తయారుచేయడానికి కూడా జంతువుల నుండి లభించే ఉత్పత్తులు ఉపయోగపడతాయి. గిరిజనులు అడవిలో రాలిన నెమలి ఈకలతో విసనకర్రలను తయారుచేసి సంతలలో అమ్ముతారు. ఇది వారి సంప్రదాయ జీవనోపాధిలో భాగం.
“కోరికలు, అత్యాశలు జీవితాన్ని దుఃఖమయం చేస్తాయని” ప్రబోధించిన వారు ఎవరు?
మహావీరుడు.
రామకృష్ణ పరమహంస.
గౌతమబుద్ధుడు.
స్వామి వివేకానంద.
కోరికలు, అత్యాశలు జీవితాన్ని దుఃఖమయం చేస్తాయని గౌతమబుద్ధుడు ప్రబోధించాడు. మానవుడి అత్యాశ కారణంగానే ప్రకృతి సంపద అంతా నాదే అనే ఆధిపత్యం పెరిగి, పర్యావరణ కాలుష్యానికి మరియు జీవజాతులు అంతరించడానికి కారణమవుతోంది.
ట్రిఖోగ్రామా కీటకాన్ని సృష్టించింది ఎవరు?
జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి.
జాతీయ పత్తి పరిశోధన మండలి.
రాష్ట్రీయ వ్యవసాయ పరిశోధన మండలి.
జాతీయ జీవవైవిధ్య మండలి.
ట్రిఖోగ్రామా కీటకాన్ని జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించారు. ఇది పంటలకు హాని చేసే పురుగుల గుడ్లలో పరాన్నజీవిగా జీవించి వాటిని నాశనం చేస్తుంది. ఇది జీవ నియంత్రణలో రైతులకు ముఖ్యమైన బయోఏజెంట్‌గా ఉపయోగపడుతుంది.
జంతువుల నుండి లభించే ఉత్పత్తులకు సంబంధించి కిందివాటిలో సరి కానిది ఏది?
గుండీలు - ఎద్దు కొమ్ములు.
పాలు, గుడ్లు – గాడిద.
విసనకర్ర - నెమలి ఈకలు.
మాంసం - గొర్రెలు, మేకలు.
ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేస్తారు, నెమలి ఈకలతో విసనకర్రలు తయారు చేస్తారు, గొర్రెలు మరియు మేకల నుండి మాంసం లభిస్తుంది. కానీ గాడిదను ప్రధానంగా రవాణా మరియు శ్రమ పనుల కోసం ఉపయోగిస్తారు. గాడిద పాలు ఇచ్చినప్పటికీ, వాటిని కొన్ని ప్రత్యెక సందర్భాలలో మాత్రమే ఉపయోగిస్తారు.
రైతు మిత్రుడుగా చెప్పబడే వానపాము యొక్క ప్రధాన ఉపయోగాలు ఏవి?
పంటపొలాల్లోని ఎలుకల్ని తినడం ద్వారా.
నేల గుల్లబారేలా చేసి, మొక్క వేర్లకు గాలి లభించేలా చేయడం ద్వారా.
పురుగుల గుడ్లను నాశనం చేయడం ద్వారా.
పంటలకు హానిచేసే పురుగులను గూటిలో చిక్కుకునేలా చేయడం ద్వారా.
వానపాము వ్యవసాయ భూమిలోని వ్యర్థ పదార్థాలను తింటుంది. ఇది విసర్జించే పదార్థం సహజ ఎరువుగా మారి భూమికి బలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా వానపాము వల్ల నేల గుల్లబారి, మొక్క వేర్లకు గాలి బాగా లభిస్తుంది. అందువల్ల మొక్క ఏపుగా పెరిగి పంట దిగుబడి పెరుగుతుంది.
ఆదిమానవులు ఏ లక్షణాల కోసం జంతువులను మచ్చిక చేసుకున్నారు?
వినోదం మరియు మాంసం.
ఆహారం, రక్షణ మరియు రవాణా.
ఉన్ని మరియు పాలు.
విక్రయించడం మరియు ఎగుమతి.
ఆదిమానవులు జీవనాధారానికి అవసరమైన ఆహారం పొందడం, వేట మరియు శత్రువుల నుండి రక్షణ పొందడం మరియు ఒక చోటు నుండి మరొక చోటుకు సులభంగా వెళ్లడం వంటి రవాణా అవసరాల కోసం జంతువులను మచ్చిక చేసుకున్నారు.
జంతువులను వినియోగించే అవసరాలకు సంబంధించి కిందివాటిలో సరి కాని జత ఏది?
వ్యవసాయం కోసం – ఎడ్లు, దున్నపోతులు.
వస్తువుల కోసం – నెమలి ఈకలు, ఎద్దు కొమ్ములు.
రవాణా కోసం – ఒంటెలు, గాడిదలు.
విశ్రాంతి కోసం – గొర్రెలు, మేకలు.
వ్యవసాయ పనుల కోసం ఎడ్లు, దున్నపోతులను ఉపయోగిస్తారు. వస్తువుల తయారీకి నెమలి ఈకలు, ఎద్దు కొమ్ములు వంటివి ఉపయోగిస్తారు. రవాణా కోసం ఒంటెలు, గాడిదలు వంటి జంతువులను వినియోగిస్తారు. అయితే గొర్రెలు, మేకలు ప్రధానంగా పాలు, మాంసం, ఉన్ని కోసం ఉపయోగించబడతాయి. అంతేకానీ, అవి విశ్రాంతి కోసం ఉపయోగించే జంతువులు కావు.
కిందివాటిలో మానవులకు, జంతువులకు రెండింటికీ ప్రాథమిక అవసరం కానిది ఏది?
గాలి, నీరు.
ఆహారం, నివాసం.
ప్రేమ, కరుణ, ఆదరణ.
ఆధిపత్యం, అత్యాశ.
గాలి, నీరు, ఆహారం, నివాసం వంటి వాటితో పాటు, ప్రేమ, కరుణ, ఆదరణ వంటివి కూడా మానవులకు మరియు జంతువులకు అతి ముఖ్యమైన ప్రాథమిక అవసరాలు. అత్యాశ మరియు ఆధిపత్యం అనేవి మానవ లక్షణాలు, ఇవి ప్రాథమిక అవసరాలు కావు.
ట్రిఖోగ్రామా కీటకం యొక్క జీవితకాలం ఎంత?
ఒక రోజు.
వారం రోజులు.
ఒక నెల.
మూడు నెలలు.
ట్రిఖోగ్రామా కీటకం పంటలకు హానిచేసే పురుగుల గుడ్లను నాశనం చేసే ఒక జీవ నియంత్రణ కీటకం. దీని జీవితకాలం సాధారణంగా ఒక వారం వరకు మాత్రమే ఉంటుంది. ఈ తక్కువ కాలంలోనే ఇది అనేక హానికర పురుగుల గుడ్లను నాశనం చేసి రైతులకు సహజ రక్షణను అందిస్తుంది.
సాలెపురుగు రైతుకు ఏ విధంగా సహాయపడుతుంది?
వ్యర్థ పదార్థాలను తిని నేలకు బలాన్ని ఇవ్వడం ద్వారా.
పంటలకు హానిచేసే పురుగులు, దోమలను గూటిలో చిక్కుకునేలా చేసి తినడం ద్వారా.
పంటపొలాల్లోని ఎలుకల్ని తినడం ద్వారా.
పురుగుల గుడ్లను నాశనం చేయడం ద్వారా.
సాలెపురుగు ఉదర భాగంలోని గ్రంథుల నుండి దారాన్ని స్రవించి గూడు అల్లుతుంది. పంటలకు హానిచేసే పురుగులు, దోమలు ఈ గూటిలో చిక్కుకుంటాయి. వాటిని సాలెపురుగు తిని పంటలను కాపాడుతుంది. ఈ విధంగా సాలెపురుగులు సహజ శత్రువులుగా వ్యవహరించి రైతులకు మిత్రులుగా ఉపయోగపడతాయి.
ప్రస్తుతం మన దేశంలో పులులతో పాటు సంఖ్య తగ్గుతున్న జంతువులు/పక్షులలో లేనిది ఏది?
కలివికోడి.
బట్టమేక పక్షి.
ఒంగోలు ఆవు.
పుంగనూరు ఆవు.
పులులు, కలివికోడి, బట్టమేక పక్షి, పుంగనూరు ఆవు వంటి జాతుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. వీటి సంరక్షణకు చర్యలు చేపట్టకపోతే అవి అంతరించడం ఖాయ. కానీ ఒంగోలు ఆవు ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా పెంచబడుతున్న దేశీ జాతి. అందువల్ల ఇది సంఖ్య తగ్గుతున్న జాబితాలోకి రాదు.
రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతంలో రవాణా కోసం ఎక్కువగా ఏ జంతువును ఉపయోగిస్తారు?
ఒంటె.
గాడిద.
కంచర గాడిద.
గుర్రం.
రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో రవాణా కోసం ఎక్కువగా ఒంటెలను ఉపయోగిస్తారు. ఒంటెను "ఎడారి నౌక" అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది తక్కువ నీటితో ఎక్కువ దూరం ప్రయాణించగలదు మరియు ఇసుకలో నడవడానికి అనుకూలమైన శరీర నిర్మాణం కలిగి ఉంటుంది.
కిందివాటిలో విషం ఉన్న పాముల జాతులలో లేనిది ఏది?
నాగుపాము.
రక్త పింజర.
నీరు పాము.
కట్ల పాము.
పాములలో నాగుపాము, కట్ల పాము, సముద్రపాము, రక్త పింజర జాతి పాములకు మాత్రమే విషం ఉంటుంది. మిగతా పాములకు విషం ఉండదు. నీరు పాము విషరహిత జాతి. ఇది నీటిలో నివసిస్తూ చిన్న చేపలు, కీటకాలను ఆహారంగా తీసుకుంటుంది. అందువల్ల నీరు పాము విషపూరిత పాములలోకి రాదు.
పంటపొలాల్లో తిరుగుతూ, మొక్కలపై ఉన్న చిన్న పురుగులను, వాటి గుడ్లను తిని రైతులకు సహాయపడే ప్రాణి ఏది?
పాము.
వానపాము.
సాలెపురుగు.
చీమ.
చీమ పంటపొలాల్లో మరియు మొక్కలపై తిరుగుతూ, మొక్కలపై ఉన్న చిన్న పురుగులను, వాటి గుడ్లను తింటుంది. ఈ విధంగా రైతులు క్రిమిసంహారక మందులు చల్లే అవసరం లేకుండా చీమలు పంటలకు హాని చేసే కీటకాలను తగ్గించి రైతులకు సహజ రక్షకులుగా మరియు రైతు మిత్రులుగా సహాయపడతాయి.
కిందివాటిలో రైతు మిత్రుడుగా పరిగణించబడనిది ఏది?
వానపాము.
సాలెపురుగు.
పాము.
గొంగళి పురుగు.
రైతు మిత్రులు అంటే పంటలకు మేలు చేసే జీవులు. వానపాము నేలను పొడిగా చేసి పంటలకు పోషకాలు అందిస్తుంది. సాలెపురుగు పంటలకు హాని చేసే పురుగులను తింటుంది. పాము ఎలుకలను నియంత్రిస్తుంది. కానీ గొంగళి పురుగు మాత్రం పంటలను తిని నాశనం చేస్తుంది, కాబట్టి ఇది రైతు మిత్రుడు కాదు.
ఆదిమానవులు మొదట్లో తమ ప్రధాన ఆహారంగా దేనిని తీసుకునేవారు?
కేవలం వ్యవసాయ పంటలు.
పశువుల పాలు మరియు దుంపలు.
జంతువుల మాంసం మరియు దుంపలు.
చేపలు మరియు పండ్లు.
ఆదిమానవులు అడవుల్లో నివసిస్తూ జంతువులను వేటాడి వాటి మాంసాన్ని తినేవారు. అలాగే నేలలో లభించే దుంపలు, మూలాలను తవ్వి ఆహారంగా ఉపయోగించేవారు. తరువాత కాలంలో వారు వ్యవసాయం, పశుపోషణ వంటి పద్ధతులను అభివృద్ధి చేసుకున్నారు.
గొర్రెల మంద పొలంలో ఉంచడం ద్వారా రైతులకు కలిగే ముఖ్యమైన ఉపయోగం ఏమిటి?
గొర్రెల కాపరులు తమ పంటలను కాపాడుతారు.
గొర్రెల పెంట పొలంలో ఎరువుగా ఉపయోగపడుతుంది.
గొర్రెపిల్లల్ని అమ్మకుండా ఉంచడానికి సహాయపడుతుంది.
చిరుతపులులు, తోడేళ్ళ నుండి రక్షణ లభిస్తుంది.
గొర్రెల మంద పొలంలో ఉంచినపుడు వాటి పెంట సహజ ఎరువుగా మారి నేలలో కలుస్తుంది. ఈ ఎరువు నేలలో పోషకాలను పెంచి పంటల పెరుగుదలకు సహాయపడుతుంది. రసాయన ఎరువుల అవసరం కూడా తగ్గుతుంది. అందువల్ల గొర్రెల పెంట రైతులకు ముఖ్యమైన వ్యవసాయ ప్రయోజనాన్ని అందిస్తుంది.
భూమి అనేది కేవలం మనుషులకు మాత్రమే చెందుతుందా?
లేదు, భూమి రకరకాలైన జీవజాతులకు ఆలవాలం.
అవును, ప్రకృతి వనరులు మనుషులకే ఎక్కువ అవసరం.
లేదు, కేవలం చెట్లు, జంతువులకు మాత్రమే.
అవును, మానవుడే అత్యంత తెలివైన జీవి.
ఈ భూమి కేవలం మనుషులదే కాదు. ఇది రకరకాలైన జీవజాతులకు అంటే చెట్లు, జంతువులు, పక్షులు, కీటకాలు, చేపలు మొదలగు వాటికి ఆలవాలం. ప్రకృతి వనరులను అనుభవించే హక్కు అన్ని జీవులకూ సమానంగా ఉంది. కానీ మనిషి అత్యాశతో ఆధిపత్యం చెలాయిస్తున్నాడు.
కరువు వచ్చినప్పుడు పాలమూరు జిల్లా గొర్రెల కాపరులు తమ జీవాలతో ఎక్కడికి వలస వెళ్తారు?
మహారాష్ట్రకు.
కర్ణాటకకు.
నల్లగొండ లేదా యాదగిరిగుట్ట ప్రాంతాలకు.
రాజస్థాన్ చుట్టుపక్కల ప్రాంతాలకు.
పాలమూరు జిల్లాలో తీవ్రమైన కరువు వచ్చినపుడు గొర్రెల కాపరులు తమ జీవనోపాధి కోసం మరియు తమ జీవాలను కాపాడుకోవడానికి పశుగ్రాసం (పచ్చిక) సులభంగా లభించే నల్లగొండ లేదా యాదగిరిగుట్ట ప్రాంతాలకు సుమారు ఆరు నెలల పాటు వలస వెళ్తారు. ఇది సంప్రదాయమైన జీవన విధానంగా కొనసాగుతోంది.
